WhatsApp Image 2026-06-29 at 12.41.23 PM
7TV Focus News

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగపడుతోందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద అన్నారు. చింతల్‌లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రూ.58 లక్షల విలువైన 172 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు...
⏱ Top Story 👁 36 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article