సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి..
7tv focus : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఓ మహిళను మృత్యువు కబళించింది. బస్సు ఎక్కే క్రమంలో పక్క నుంచి మరో బస్సు రావడంతో రెండింటి మధ్య చిక్కుకుని ఆమె ప్రాణాలు కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.గురువారం సిద్దిపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) హాజరైంది. సభ ముగిసిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఆమె ఎక్కుతున్న బస్సు పక్క నుంచి మరో బస్సు రావడంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలైన సారవ్వ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు...
⏱ Top Story
👁 25 Views |
⬇️ 0 Downloads