Fireworks_in_Tunnel_33af3fb3d4_V_jpg--625x351-4g
7TV Focus News

సొరంగమార్గంలో టపాసులు పేల్చిన కుటుంబం..

7tv focus : సొరంగమార్గంలో ఓ కుటుంబం టపాసులు పేల్చిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు సమీపంలో 58వ జాతీయ రహదారిపై ఉన్న చిర్వా టన్నల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సొరంగమార్గం లోపల కారు నిలిపిన ఓ కుటుంబం ముందూవెనుకా ఆలోచించకుండా అక్కడ టపాసులు పేల్చింది. దీంతో, అక్కడ దట్టమైన పొగకమ్ముకుంది.ఈ వీడియో నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ కుటుంబంపై మండిపడ్డారు. కనీస ఇంగిత జ్ఞానం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షలు, జరిమానాలు పడతాయన్న భయం లేకపోతే ఇలాగే జరుగుతుందని మరికొందరు చెప్పారు. కొందరికి పౌర స్పృహ వీసమెత్తు కూడా ఎందుకుండదని...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article