స్పోర్ట్స్ స్కూల్లో చెత్తాచెదారం.. రోగాల బారిన విద్యార్థులు, మండిపడుతున్న తల్లిదండ్రులు
హనుమకొండ 7tv focus : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారుల తీరు విద్యార్థులకు శాపంగా మారింది. పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనాభ్యసించాల్సిన విద్యార్థులు పేరుకుపోయిన చెత్త చెదారంతో సావాసం చేస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాల్సిన విద్యార్థులు రోగాల బారిన ఇంటికెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలు ఇలాంటి వాతావరణంలో ఉండాల్సి రావడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్ హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు. ఇంకా ఇప్పటివరకు ఎలాంటి జీవో ప్రకటించలేదు.అరకొర వసతులు సమకూర్చి నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads