Srinivas-Goud-2_V_jpg--816x480-3g
7TV Focus News

 హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి

7tv focus : హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని బలహీనపరి చేందుకు అప్పటి ప్రభుత్వం హాస్టళ్లలో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యార్థులను బయటకు పంపించే కుట్ర మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి సంబంధించిన ఈ-1, ఈ-2, డీ వసతి గృహాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపించడం...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article