hcu-food-poison_V_jpg--816x480-4g
7TV Focus News

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత

 7tv focus : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెన్స్ హాస్టల్ ఎం, అనెక్స్, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడ్డారు. దీంతో బాధితులను యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెన్స్ హాస్టల్ ఎం వద్ద అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. మరోవైపు డీఎస్‌డబ్ల్యూ తెల్లవారుజామున 2.45 గంటలకు యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి బాధిత విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు.ఈ ఘటనపై స్పందించిన విద్యార్థి సంఘాలు పలు డిమాండ్లను యూనివర్సిటీ యాజమాన్యం...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article