హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్‌లపై పోలీసుల నిఘా.. హనీట్రాప్‌లపై విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 26: జూబ్లీహిల్స్ పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. డేటింగ్ యాప్‌ల పేరుతో హనీట్రాప్‌లు, భారీ బిల్లుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐదు నెలల్లో 70 మందికిపైగా బాధితులు.. రూ.35 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 70కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో 33 ఫిర్యాదులు హైదరాబాద్ నుంచి.. మిగిలినవి ఇతర పోలీస్ కమిషనరేట్ల పరిధి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన మహిళలతో పబ్‌లు, రెస్టారెంట్లకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి మోసపోయినట్లు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెబుతున్నారు. డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళతో రెస్టారెంట్‌కు వెళ్లిన శేఖర్‌కు రూ.28 వేల బిల్లు...
⏱ Top Story
👁 16 Views |
⬇️ 0 Downloads