images
7TV Focus News

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ పట్టివేత

హైదరాబాద్ 7tv focus : నగరంలోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని తనిఖీ చేయగా.. తొలుత నాలుగు కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. విచారణలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి మద్యం తీసుకున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. దాదాపు 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 55 కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article