metro_ticket_a0f81865a6_V_jpg--625x351-4g
7TV Focus News

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

హైదరాబాద్ 7tv focus : భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ సేవలు పనిచేయకపోవడంతో మెట్రో స్టేషన్ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article