హైవేపై ఢీకొన్న కాన్వాయ్‌లోని వాహనాలు- రాహుల్‌కు తప్పిన పెను ప్రమాదం
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో సుల్తాన్‌పుర్‌కు బయల్దేరారు. ఆ ప్రయాణంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 10.15 గంటల సమయంలో కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ఓ ప్రైవేటు వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని కొన్ని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. చివర్లో ఉన్న వాహనాలతో పాటు ఓ అంబులెన్స్ కూడా ఢీకొన్నట్లు సమాచారం. ఆ వాహనాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఉన్నారు....
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads