100 మీటర్లకు పైగా మహిళను ఈడ్చుకెళ్లిన దొంగలు..
7tv focus : అస్సాంలోని గువాహటిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కాలిగాబరా ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను స్కూటీపై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళ కిందపడిపోగా.. గొలుసు కోసం ఆమెను రోడ్డుపై సుమారు 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళను పట్టించుకోకుండా గొలుసును లాక్కున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. మహిళల భద్రతపై ఆందోళన.. బంగారు గొలుసు కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లడం స్థానికంగా భయాందోళనలకు కారణమైంది. స్కూటీలు, బైక్‌లపై వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు....
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads