35 ఏళ్ల విద్యుత్ సేవలకు నేడు వీడ్కోలు
పదవీ విరమణ పొందనున్న బి. వేణుగోపాల స్వామి అంకితభావంతో అందించిన సేవలు అభినందనీయం: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు ఎం.డి. షౌకత్ పాషా కుత్బుల్లాపూర్, ఆగస్టు 29 (విజన్ ఆంధ్ర): తెలంగాణ విద్యుత్ ప్రసార సంస్థలో 35 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన బి. వేణుగోపాల స్వామి నేడు పదవీ విరమణ పొందనున్నారు. షాపూర్‌నగర్‌లోని 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో ఏడీగా విధులు నిర్వహించిన ఆయన విద్యుత్ రంగంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. వేణుగోపాల స్వామి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. షౌకత్ పాషా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఉద్యోగ ప్రస్థానంలో సంస్థ పట్ల నిబద్ధతతో, బాధ్యతాయుతంగా...
⏱ Top Story
👁 31 Views |
⬇️ 0 Downloads