ntsb_V_jpg--816x480-4g
7TV Focus News

 8 మందితో వెళ్తున్న చార్ట‌ర్ విమానం ..

అల‌స్కా 7tv focus : ప‌శ్చిమ అల‌స్కాలో చార్ట‌ర్ విమానం కూలింది. ఆ విమానంలో 8 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు పైలెట్లు, ఆరుగురు ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే వారి ప‌రిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియ‌ద‌ని నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డు చీఫ్ పేర్కొన్నారు. అల‌స్కాలోని యాంక‌రేజ్ సిటీ నుంచి ఆ చార్ట‌ర్ ప్లేన్ టేకాఫ్ తీసుకున్న‌ది. కేప్ న్యూహెన్‌హ‌మ్ స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఆ విమానం కూలి ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌నకు చెందిన ప్రాథ‌మిక స‌మాచారం మాత్ర‌మే అందింద‌ని, పూర్తి వివ‌రాలు అందాల్సి ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. అల‌స్కా రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ ప్ర‌స్తుతం సెర్చ్‌, రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article