ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కిషోర్ రెడ్డి
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కో-ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ 282వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నిర్వహించిన 48వ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కో-ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీవాసులు ఇటువంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె. పృధ్వీరాజ్, ఫలూర్ రెహమాన్, వెంకటేష్...
⏱ Top Story
👁 22 Views |
⬇️ 0 Downloads