7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కో-ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ 282వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నిర్వహించిన 48వ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కో-ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీవాసులు ఇటువంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె. పృధ్వీరాజ్, ఫలూర్ రెహమాన్, వెంకటేష్ (బిల్లా), జగన్, సాధు యాదవ్, గజ, సింధేష్, మనోజ్, చెన్నమ, నాగమణి, స్వప్న, కమల, సాయి బాబు, శ్రీనివాస్ నగర్ కాలనీవాసులు, టీమ్ బీకేఆర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

