7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: నిరుపేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం సామాజిక బాధ్యతలో భాగమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట కొండపై ఉన్న సహస్రార్జున దేవాలయం వద్ద ఎస్ఎస్కే సమాజ్–కుత్బుల్లాపూర్ ఆధ్వర్యంలో సోమవారం నిరుపేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పుస్తకాలు అందిస్తూ ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజ సేవతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సహస్రార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షుడు హనుమంతరావు, సహస్రార్జున దేవాలయ వ్యవస్థాపకుడు గోల్కొండ ఓం ప్రకాష్, ఉపాధ్యక్షుడు రఘు, సభ్యులు దశరథ్, రాజ్‌కుమార్, శివ, నాగేందర్, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

