‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
7tv focus : నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భావితరాలకు నీటి వనరులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఆరుతడి...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads