WhatsApp Image 2026-07-07 at 9.44.27 PM
7TV Focus News

ఫరూక్‌నగర్ బేడ బుడగ జంగం సంఘానికి నూతన కమిటీ

షాద్‌నగర్, జూలై 7 (7టీవీ ఫోకస్): ఫరూక్‌నగర్ మండల బేడ బుడగ జంగం సంఘానికి నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బేడ బుడగ జంగం షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించి, ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, ఐక్యత కోసం నూతన కమిటీ సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. నూతన కమిటీలో మండల అధ్యక్షుడిగా వానరసి స్వామి, ఉపాధ్యక్షులుగా సదుల స్వామి, కప్పేరా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సదుల ఆనంద్, కోశాధికారిగా సదుల నందును నియమించారు. ఈ సందర్భంగా తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ, బేడ బుడగ జంగం సమాజ హక్కుల పరిరక్షణ, సంక్షేమం,...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article