షాద్నగర్, జూలై 7 (7టీవీ ఫోకస్): ఫరూక్నగర్ మండల బేడ బుడగ జంగం సంఘానికి నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బేడ బుడగ జంగం షాద్నగర్ తాలూకా అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించి, ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, ఐక్యత కోసం నూతన కమిటీ సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. నూతన కమిటీలో మండల అధ్యక్షుడిగా వానరసి స్వామి, ఉపాధ్యక్షులుగా సదుల స్వామి, కప్పేరా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సదుల ఆనంద్, కోశాధికారిగా సదుల నందును నియమించారు. ఈ సందర్భంగా తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ, బేడ బుడగ జంగం సమాజ హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం ప్రతి సభ్యుడు బాధ్యతతో పనిచేయాలని కోరారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వానరసి యాదయ్య, కళ్లెం ఉషయ్య, సదుల అంజయ్య, సదుల బాలకృష్ణ, సదుల పెంటయ్య, తూర్పాటి జంగయ్య, సదుల సత్యనారాయణ, సదుల యాదయ్య, కాలేం లింగం, తూర్పాటి దశరథ్, ఎన్. పెట్టయ్య, తూర్పాటి మల్లేష్, శ్రీశైలం, లోకేష్, పరశురాం, బిక్షపతి, మల్లేష్, యాదయ్య, జంగయ్య, కప్పేరా అంజయ్య, నరసింహులు, రాములు, అంజి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

