ఎస్ఐఆర్-2002 వివరాలు తెలియక తంటాలు
ఎన్యూమరేషన్ పత్రం నింపడంలో అయోమయం
మిడ్జిల్, జూలై 9 (7 టీవీ పోకస్ న్యూస్ ) ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్-సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను నింపడంలో ఓటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్-2002 వివరాలు అందుబాటులో లేకపోవడంతో పత్రాలను ఎలా పూరించాలో అర్థమవక, తప్పులు రాస్తే ఓటు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఇలా… ఎన్యూమరేషన్ పత్రంలో ఎస్ఐఆర్-2002 వివరాలను ఏ బాక్సులో నింపాలి. ఎలా నింపాలి? ఒకవేళ 2002లో ఓటరుగా నమోదు అయితే ఆ వివరాలను ఎలా సేకరించాలి? చాలామంది ఓటర్లు పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారారు. అప్పటివివరాలు అందుబాటులోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలి? ఆన్లైన్లోవివరాలు తీసుకుందామంటే ఓటరు పేరు నమోదుచేస్తే ఎస్ఐఆర్-2002తో మ్యాచ్ కావడంలేదు. జిల్లా కేంద్రాలు, పట్టణాల , మండల, వందల్లో పోలింగ్‌బూత్‌లు ఉన్నాయి. ఏ బూత్‌లో ఓటు ఉందో వెతకడం ఇబ్బందికరంగా మారుతోంది. చాలామంది ఓటర్ల చిరునామాలు మారాయి. ప్రస్తుతమున్న ఇళ్లకే కొత్త ఇంటినంబర్లు వచ్చాయి. పోలింగ్‌బూత్‌ల కేంద్రాలు, నంబర్లు మారాయి.
కీలకం… ఎస్ఐఆర్-2002 వివరాలు
ఓటర్ల వద్దకు ఎన్యూమరేషన్ పత్రాలు రావడమే గగనంగా ఉంది. కొన్నిచోట్ల బీఎల్వోల ఫోన్‌నంబర్లను తెలుసుకుని వారివద్దకే వెళ్లి పత్రాలను తీసుకోవాల్సి వస్తోంది.ఎన్యూమరేషన్ పత్రాల్లో రెండు బాక్సుల రూపంలో కాలమ్‌లు ఉన్నాయి. ఓటరుకు ఎస్ఐఆర్-2002లో ఓటు నమోదై ఉంటే… మొదటి బాక్సు కాలమ్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఓటరు పేరు, గుర్తింపు కార్డు, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య వివరాలను నింపాలి. అయితే చాలామందికి ఈ వివరాలు తెలియడం లేదు. ప్రధానంగా పట్టణాలు, నగర ప్రాంతాల్లో ఉంటున్న, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారికి తమ పాత వివరాలను తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఈసీఐనెట్ యాప్‌లో, వెబ్సైట్లో ఎస్ఐఆర్-2002 వివరాలను తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటనలు చేస్తున్నా… ఆన్లైన్లో వివరాలు సక్రమంగా రావడం లేదు. మరోవైపు పేర్లలో చిన్న తేడా ఉన్నా వాటి వివరాలు ఆన్లైన్లో చూపించడం లేదు.
2002 జాబితాలో పేరు లేని ఓటరు… రెండో బాక్సు(కాలమ్)లో తల్లిదండ్రులు, తాతా, నానమ్మ వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి. ఇందులో వారి తల్లి/తండ్రి ఓటరు పేరు, గుర్తింపు కార్డు, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య వివరాలను నింపాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్-2002 జాబితాలో పేర్లులేని, తల్లిదండ్రుల వివరాలు సైతం లేనివారు ఈ 2 బాక్సులను వదిలేసి కిందఉన్న మూడోబాక్సును మాత్రమే నింపాల్సి ఉంటుంది. ఇది తెలియక ఓటర్లు అవస్థలుపడుతున్నారు.
ఆ రెండు బాక్సులు నింపకుంటేనే నోటీసులు…
ఎన్యూమరేషన్ పత్రాల్లో పైననున్న రెండు బాక్సులను నింపకుంటే… సర్వే పూర్తయిన తర్వాత జులై 31 నుంచి ఆయా ఓటర్లకు నోటీసులను అందిస్తారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలను ఈఆర్వోకు చూపించాల్సి ఉంటుంది. వాటిని సమయానికి ఈఆర్వో ముందు సమర్పించలేకపోతే ఓటును తీసి వేస్తారు. 2.38 కోట్ల ఓటర్లకు మ్యాపింగ్ ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన మ్యాపింగ్‌లో 2,38,62,332 మంది ఎస్ఐఆర్-2002 జాబితాతో లింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. చాలాచోట్ల బీఎల్వోలు స్థానికులు, గ్రామపెద్దలు, కాలనీ సంఘాలతో మాట్లాడి ఓటర్లను మ్యాపింగ్ చేశారు. ఎన్నికల అధికారుల రికార్డుల్లో మాత్రం మ్యాపింగ్ జరిగినట్లు ఉంటుంది. ఎన్యూమరేషన్ పత్రాలను నింపే సమయంలో మాత్రం ఈ మ్యాపింగ్‌కు సంబంధించిన ఎస్ఐఆర్-2002 వివరాలను చెప్పడంలో మాత్రం బీఎల్వోలు ఇబ్బందులు పడుతున్నారు.

