WhatsApp Image 2026-07-06 at 5.52.40 PM
7TV Focus News

రూ.65 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: నిజాంపేట్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం – ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ 273వ డివిజన్ పరిధిలోని కొలన్ నారాయణరెడ్డి కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీలో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందించిన హన్మంత్‌రెడ్డి, సంబంధిత అధికారులతో చర్చించి మున్సిపల్ నిధుల ద్వారా రూ.65 లక్షలు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం...
⏱ Top Story 👁 59 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article