7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: నిజాంపేట్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం – ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని కాంగ్రెస్ ఇన్చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ 273వ డివిజన్ పరిధిలోని కొలన్ నారాయణరెడ్డి కాలనీలో రూ.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీలో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందించిన హన్మంత్‌రెడ్డి, సంబంధిత అధికారులతో చర్చించి మున్సిపల్ నిధుల ద్వారా రూ.65 లక్షలు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. కాలనీలోని రహదారులు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి, స్థానికులు సూచించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం కాలనీ వాసులు కొలన్ హన్మంత్‌రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కోట మురళి, బాచుపల్లి అధ్యక్షుడు కొలన్ జీవన్‌రెడ్డి, మౌళేశ్వర్రావు, ఇందిరా కడియాల, అసోసియేషన్ సభ్యులు రమణరెడ్డి, చిర్ర శ్రీనివాస్‌రెడ్డి, జె. నాగిరెడ్డి, కొలన్ మాణిక్‌రెడ్డి, కొలన్ వెంకట్‌రెడ్డి, నాగేశ్వర్రావు, సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, వర్మరాజు, మామిడ్ల శ్రీనివాస్, గిరిధర్, సత్యప్రసాద్, విజయ్, జైపాల్‌రెడ్డి, కోటిరెడ్డి, ఉపేందర్, కృష్ణారెడ్డి, కొలన్ కృష్ణారెడ్డి, కైలాష్, అంజిరెడ్డి, పి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

