7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: కారు ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు సోమవారం పరామర్శించారు. శంభీపూర్ రాజు నివాసానికి వెళ్లిన హరీశ్‌రావు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్యుల సూచనల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రమాదం నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు క్షేమంగా బయటపడటం సంతోషకరమని పేర్కొన్నారు. పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల సూచనలను పాటించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా శంభీపూర్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ధైర్యం చెబుతున్నాయి. హరీశ్‌రావు పరామర్శ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని శంభీపూర్ రాజు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

