వెంకన్న సన్నిధిలో..క్రికెట్ కేరింతల జాతర
7tv focus : తిరుమల శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతి నగరం మరో ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిని క్రీడా కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని శెట్టిపల్లెలో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ మైదానం అందుబాటులోకి వస్తే తిరుపతి క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. 50 వేల సీటింగ్ సామర్థ్యంతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ స్టేడియంలో ఏకంగా 50 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం కల్పించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads