వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..? న్యాయం చేయాలంటూ గిరిజన కుటుంబం ఆవేదన
బుట్టాయిగూడెం, జూలై 6 (7 టీవీ ఫోకస్): జ్వరం, వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నాలుగేళ్ల గిరిజన చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె మృతికి కారణమని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కొర్సారిగూడెం పంచాయతీ మోతుగూడెం గ్రామానికి చెందిన గోగుల వెంకటరెడ్డి, సునీత దంపతుల నాలుగేళ్ల కుమార్తె జేత్వికకు జ్వరం, వాంతులు, విరేచనాలు రావడంతో శనివారం రాత్రి సుమారు 8.50 గంటలకు బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి దాదాపు 28 గంటల పాటు సరైన వైద్య సేవలు అందించలేదని, చివరకు పరిస్థితి విషమించిందని చెప్పి సోమవారం...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 1 Downloads