7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 30: తెలంగాణ పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ను తెలంగాణ టూరిజం ప్లాజాలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ టూరిజం ప్లాజాకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును, ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

