7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తమ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ఆయన పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తమ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గాజులరామారం డివిజన్ ఉషోదయ కాలనీ ఫేజ్–2 అధ్యక్షుడు పీరా రెడ్డి, బాలయ్యనగర్ అధ్యక్షుడు నగేష్, సుభాష్‌నగర్ డివిజన్‌కు చెందిన సీనియర్ నాయకుడు అడప శేషు, ఎస్ఆర్ నగర్‌కు చెందిన సింహాచలం ఎమ్మెల్యేను కలిసి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కాలనీల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, పోలే శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

