7 టీవీ ఫోకస్
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కూకట్పల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బోనాల శంకర్‌ను తాజాగా కైతలపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రతి ఉద్యమంలో ముందుండే నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బోనాల శంకర్ నియామకం ద్వారా కైతలపూర్ డివిజన్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. స్థానిక సమస్యలపై ప్రజల తరఫున పోరాడుతూ, యువతను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని నాయకులు పేర్కొంటున్నారు. త్వరలో డివిజన్ స్థాయిలో బూత్ కమిటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

