7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గాజులరామారం డివిజన్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు సొంటిరెడ్డి పున్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గాజులరామారం డివిజన్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు సొంటిరెడ్డి పున్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన మహిళలకు ఆయన చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పున్నారెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా మహిళల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీపీ నగర్ స్లమ్ డ్వాక్రా అధ్యక్షురాలు వాణి, సుజాత, డ్వాక్రా సంఘాల సభ్యులు, కాలనీ మహిళలు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

