( 7 టీవీ ఫోకస్ న్యూస్ ) గచ్చిబౌలి, జూలై 31, 2026:
విప్రో జంక్షన్లో ట్రాఫిక్ మెరుగుదల పనుల పరిశీలన మరియు గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ
రద్దీని తగ్గించి, వాహనదారుల ప్రయాణం సురక్షితంగా మరియు సులభంగా సాగేలా చేయడానికి విప్రో జంక్షన్ వద్ద చేపట్టిన ‘ఫ్రీ లెఫ్ట్’ (Free Left) మరియు ‘యు-టర్న్’ (U-Turn) అభివృద్ధి పనులను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేపట్టిన సమగ్ర ప్రణాళికలో భాగంగా మొదటి విడత (Phase-I) కింద 10 కీలకమైన ఫ్రీ లెఫ్ట్‌లు, 5 యు-టర్న్‌లను అభివృద్ధి చేస్తున్నారు. తదుపరి విడతల్లో మరిన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రధాన జంక్షన్ల వద్ద జాప్యాన్ని తగ్గించి, వాహనాల రాకపోకలు సఫీగా సాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రతిపాదించిన 10 ఫ్రీ లెఫ్ట్ ప్రాంతాలు:సైబర్ టవర్స్ – మాదాపూర్

నానక్‌రామ్‌గూడ రోటరీ-1 – రాయదుర్గంవిప్రో జంక్షన్ (IIIT వైపు) – గచ్చిబౌలిమై హోమ్ అవతార్ – నార్సింగిగుల్మోహర్ – కొల్లూరునవ్య జంక్షన్ – ఆర్సీ పురంనవపాన్టాన్చెరుజేఎన్టీయూ ఫ్రీ లెఫ్ట్ – కేపీహెచ్‌బీ (KPHB)గాంధీమైసమ్మ – జీడిమెట్ల
మియాపూర్ జంక్షన్ (జేఎన్టీయూ వైపు) – మియాపూరప్రతిపాదించిన 5 యు-టర్న్ ప్రాంతాలు:
టీజీ-ట్రాన్స్‌కో (TG-Transco) – రాయదుర్గంవంశీ అర్బన్ అపార్ట్మెంట్స్ (బాచుపల్లి నుండి ప్రగతినగర్ వైపు) – మియాపూర్
బాలాజీ నగర్ – కూకట్పల్లిరెమిడీ – కేపీహెచ్‌బీ (KPHB)
కమలేష్ మెడికల్ హాల్ (బాలానగర్ ఫ్లైఓవర్ కింద) – బాలానగర్
పరిశీలన సందర్భంగా, పనుల పురోగతిని సమీక్షించిన జాయింట్ కమిషనర్, వీటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పనులు జరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్. రవికుమార్, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ హన్మంత్ రావు, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ టి. నరసింహరాజు, అదనపు ఇన్స్పెక్టర్ శ్రీ జి. లవకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం శ్రీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనను పెంచాలని, ట్రాఫిక్ సమస్యలపై తక్షణమే స్పందించాలని మరియు ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
మెరుగైన ట్రాఫిక్ కోసం ‘ఫ్రీ లెఫ్ట్’ మరియు ‘యు-టర్న్’ నిబంధనలు
”ఫ్రీ లెఫ్ట్ ఖాళీగా ఉంటే… ప్రయాణం సుఫీగా సాగుతుంది.”
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. రోడ్డు వినియోగదారులు ఈ క్రింది నిబంధనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు:
ఫ్రీ లెఫ్ట్ వేన్ (Lane) లోకి ప్రవేశించిన తర్వాత తప్పనిసరిగా ఎడమ వైపుకే తిరగాలి. ఫ్రీ లెఫ్ట్ వేన్ నుండి సీదా (స్ట్రెయిట్) గా వెళ్లకూడదు.
యు-టర్న్ కోసం కేటాయించిన ప్రత్యేక వేన్ను మాత్రమే ఉపయోగించాలి. ఇతర లైన్ల నుండి యు-టర్న్ తీసుకోవడానికి ప్రయత్నించకూడదు.
ఈ నిబంధనల వల్ల జంక్షన్ల వద్ద ప్రమాదాలు తగ్గి, వాహనాల రాకపోకలు సురక్షితంగా సాగుతాయి. రోడ్డు భద్రతను పెంచడానికి, నిరంతర ట్రాఫిక్ నిర్వహణకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.

