నాగర్కర్నూల్7tv focus : నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన వివాహిత అనూష(22)ను ఆమె ప్రియుడు రాము హత్యచేసి నిప్పంటించి పరారయ్యాడు. కాగా, వివాహం అయినప్పటికి రాముతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాము అనూషను హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

