కొమరంభీం ఆసిఫాబాద్7 tv focus : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి మార్గాలు మూసుకుపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోలం గూడకు చెందిన ఏడు నెలల గర్భిణి కొడప రామేశ్వరికి తక్షణ వైద్య సహాయం అవసరం కావడంతో, అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేని పరిస్థితుల్లో గ్రామస్థులు ఆమెను డోలీలో మోసుకెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటుతూ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

