7tv focus : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వందేమాతర గేయం ఆలాపనపై వివాదం అంతకంతకూ ముదురుతోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాత్రం తమ తీరును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాడిన గేయాన్నే తాను ఆలపించానని మంగళవారం ఖర్గే స్పష్టం చేశారు.అప్పటి పాటను పాడటం నేరమే అయితే కేంద్రం ఆ దివంగత నేతలపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘గాంధీ, నెహ్రూ, పటేల్ జన్మించకముందే భారత్ జాతీయ గేయాలు ఏవో నిర్ణయిస్తూ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. మీరు చెప్పినదల్లా జాతీయ ప్రమాణికం అయిపోదు. ఇలాగైతే రేపు మరో ప్రభుత్వం అధికారంలో వచ్చి చెప్పేది కూడా రూల్ అయిపోవచ్చు. 90 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీనే మేమూ కొనసాగిస్తున్నాము’ అని ఖర్గే అన్నారు.

