7tv focus : అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, అక్కడి సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిపకే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నీట్ ఉద్యమంలో తనవంతూ పాత్ర పోషించి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రినే గద్దె దించి మొదటి విజయం సాధించారు. అయితే అభిజిత్ ప్రస్తుతం ‘స్కూల్ థీక్ కరో’ (పాఠశాలను సరిదిద్దండి) అంటూ ఒక క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని లక్ష్యం ఏమిటంటే దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు బాగుచేసి పిల్లలకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చోవడానికి తగిన బెంచీలు అందజేయడం. అయితే ఇందులో భాగంగానే తన సొంత ఊరు అయిన మహారాష్ట్రలోని హింగోలిజిల్లాలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన అభిజిత్ తాను అమెరికా వదిలి ఇండియా రావడానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘స్వదేస్’ కారణామని తెలిపాడు. ఆ సినిమా చూసే తాను భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

