ఉత్తర్ప్రదేశ్ 7tv focus : నొయిడా జిల్లాలోని జేవార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కు.. కారు సహా పలు వాహనాలను ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు.నొయిడాలోని జేవార్ సమీపంలో యమునా రహదారిపైన ఓ ట్రక్కు అతివేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో అదుపుతప్పిన ట్రక్కు డివైడర్ను ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డుమీదికి దూసుకెళ్లింది. అటువైపుగా వస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

