7tv focus : నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం గ్రామ సమీపంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఇందు అరణ్య విల్లాస్ ఎదురుగా కొత్త రోడ్డులో నిర్జన ప్రదేశంలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు నాగోల్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం పక్కన మధ్య బాటిళ్లను గుర్తించారు. దీంతో మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహనికి కాళ్లు, చేతులు కనిపించకపోవడంతో కలకలం రేపింది. కుక్కలు పీక్కుతింటూ ఉండగా చూనసిట్లు మార్నింగ్ వాకర్స్ చెబుతున్నారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలు ఓయూ మాణికేశ్వర్నగర్కు చెందిన మంగమ్మగా గుర్తించారు. మహిళ కనిపించడం లేదంటూ గత నెల 28న ఓయూ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

