7tv focus : దేశాన్ని బంగ్లాదేశ్‌లాగా తగులబెట్టేందుకు, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తో్ందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. యూపీలోని లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సర్ రద్దు చేయాలంటూ, సీఈసీ రాజీనామా చేయాలంటూ ఇండియా బ్లాక్ పార్టీలు ఇటీవల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ అంశంపైనే రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసి, దేశాన్ని తగులబెట్టేలా ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న ప్రతిపక్షాలు అక్కడిలాగా ఇండియాలో కూడా ప్రభుత్వాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వాళ్లు ప్రెస్ మీట్లలో బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం దేశ యువతను పావులుగా వాడుకుంటోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, దేశ అభివృద్ధి పథాన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్యం ఎవరికీ అనుమతి ఇవ్వదు అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ఆయన మద్దతుదారులు గుర్తించాలి.

