7tv focus : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ల గురించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సర్టిఫై అయిన గ్రీన్ ఫైర్‌క్రాకర్స్‌ను పేల్చవచ్చు అని చెప్పింది. అయితే ఆ పటాకులను ఉదయం 6 నుంచి 7 వరకు, ఆ తర్వాత రాత్రి 8 నుంచి 19 వరకు పేల్చాలని కోర్టు పేర్కొన్నది. హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైమరీ, జిల్లా హెల్త్ సెంటర్లు, ఓల్డేజ్ హోమ్‌లు, నొటిఫైడ్ సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో బాణా సంచా పేల్చరాదు అని కోర్టు తెలిపింది. ఈ ప్రదేశాలను నో క్రాకర్స్ జోన్‌గా ప్రకటిస్తారు. బాణాసంచా తయారీదారులు, వ్యాపారులు ఢిల్లీ-ఎన్సీఆర్లో సెక్యూర్టీ డిపాజిట్ చేయాలని, ఆదేశాలను ఉల్లంఘించిన వారు డిపాజిట్ కోల్పోతారని కోర్టు తెలిపింది.గ్రీన్ క్రాకర్స్‌ను సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ డెవలప్ చేసింది. సంప్రదాయ పటాకుల కన్నా.. గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువ కాలుష్యాన్ని రిలీజ్ చేయాలని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

