7tv focus : రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్రావువిమర్శించారు. కరువు మండలాల ప్రకటనే తప్ప ఆర్థిక సహాయం గురించి చేతులెత్తేసారని దుయ్యబట్టారు. సోమవారం వనపర్తి జిల్లాలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కరువు మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలను ఎలా ఆదుకుంటారో చెప్పలేదని ఆరోపించారు. మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరువు మండలాలను ప్రకటించి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తే రేవంత్ రెడ్డి నయా పైసా సహాయం చేయాలన్న సోయి లేదని అన్నారు. 5వందల ఎకరాల మియాపూర్ భూములు అమ్ముతా. కమిషన్ కొడతా అనే ధ్యాసలో ఉన్నాడే తప్ప రైతులను ఎట్లా ఆదుకుంటానో చెప్పడం లేదని ఆరోపించారు.

