7tv focus : నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని తుర్కలపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి సంవత్సరం క్రితం డిప్యూటేషన్ మీద చారకొండ పాఠశాలకు వచ్చిన టీచర్ శ్రీకాంత్ గడువు ముగియడంతో తుర్కలపల్లి పాఠశాలకు తిరిగి వెళ్తుండగా మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. శ్రీకాంత్ పాఠశాలలో కొంతకాలంగా పనిచేసి విద్యార్థులతో పాటు గ్రామస్థుల ఆదరాభిమానాలను చూరగొ న్నారు. పిల్లలను ఓదారుస్తూ సదరు టీచర్ కన్నీటిపర్యంతమైన భావోద్వేగ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

