7tv focus : వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని ‘స్వయంసేవకులే’ ఆర్ఎస్ఎస్కు అసలైన గుర్తింపు అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసేవారే ప్రచారకులని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నాగ్పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ నూతన ఆడిటోరియాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి, ప్రసంగించారు.
ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించారు..
1930లలో ఆర్ఎస్ఎస్పై తొలి నిషేధ యత్నం నాటి ఆసక్తికర ఘట్టాన్ని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. నాటి రోజుల్లో ఆర్ఎస్ఎస్ను సమర్థించే స్వయంసేవకులు, భావజాల మద్దతుదారులు గానీ సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో లేరని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్పై తొలి నిషేధయత్నం జరిగినప్పుడు సభలో మద్దతు తెలిపిన ఏకైక వ్యక్తి ఇబ్రహీం అని ప్రస్తావించారు.

