7tv focus : సిడ్నీ నగరంలో మహిళలు, బాలికల కోసం తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ మూడు యోగా శిక్షణ తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ తరగతుల్లో పాల్గొంటున్న మహిళలు యోగా సాధన తమ దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, పని, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత సాధించడానికి దోహదపడుతోందని తెలిపారు.
ఈ యోగా శిక్షణ తరగతులను ఈషా ఫౌండేషన్‌కు చెందిన శిక్షకులు నిర్వహిస్తున్నారు. మొత్తం కార్యక్రమంలో భాగంగా చివరి సెషన్ నవంబర్ 21వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి సెషన్లో ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు, బాలికలకు, అలాగే యోగా శిక్షణ అందిస్తున్న ఈషా ఫౌండేషన్‌కు తెలుగు దేశం ఆస్ట్రేలియా కార్యవర్గం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

