7tv focus : తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు కుమారుడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని గదిలో బంధించి, ఇనుప వస్తువుతో కొట్టి తండ్రి హత్య చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు అతడిపై దాడి చేశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌడనాయకనపాళ్య గ్రామంలో నివసించే నంజే గౌడకు మద్యం సేవించే అలవాటు ఉన్నది. తాగి ఇంటికి వచ్చిన తర్వాత అతడు తరచుగా భార్యతో గొడవ పడేవాడు.కాగా, ఆదివారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నంజే గౌడ తన భర్యతో గొడవపడ్డాడు. అయితే తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు వారి కుమారుడైన 16 ఏళ్ల సునీల్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన నంజే గౌడ, తన భార్యను ఇంటి బయటకు పంపాడు. కుమారుడిని లోపల ఉంచి తలుపులు మూశాడు. ఇనుప పరికరంతో అతడ్ని కొట్టి చంపాడు.

