7tv focus : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం రీజియన్ పరిధిలోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ (అండర్ గ్రౌండ్) ఉద్యోగులను ఉపరితల (సర్ఫేస్) విధులకు మార్చేందుకు కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో సీనియారిటీ ప్రాతిపదికన మొత్తం 145 మంది ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశారు. వీరిలో ఏడుగురు ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు గైర్హాజరు కాగా, మరో ముగ్గురు ఉద్యోగులు సర్ఫేస్ విధులకు వెళ్లేందుకు తమ అంగీకారం లేదని తెలిపారు. మిగిలిన 135 మంది ఉద్యోగులకు వారి సీనియారిటీ ఆధారంగా జనరల్ అసిస్టెంట్ (సర్ఫేస్) పోస్టింగ్‌లను కేటాయించారు. ఇందులో కొత్తగూడెం ఏరియాకు 10 మందిని, సత్తుపల్లి ఏరియాకు 125 మంది ఉద్యోగులను కేటాయించారు.ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తూ నిర్వహించి పోస్టింగ్‌ల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేశారు.

