7tv focus : ప్రతిష్టాత్మక రొటర్డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోని లైమ్లైట్వి భాగానికి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘డోరతీ’ చిత్రం ఎంపికైంది. ప్రపంచ సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వేదికపై ఈ సినిమా స్థానం సంపాదించడం చిత్రబృందానికి, సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శితమయ్యే చిత్రాలు అంతర్జాతీయ ప్రేక్షకులు, ఫిలిం మేకర్లు, విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తుండటంతో ‘డోరతీ’కి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తోంది.కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సనంతో, రిషికాంత్ ముఖ్య పాత్రలలో కనిపించారు. సిఖ్యా ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్, ధమ్మమ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. బలమైన కథనం, విభిన్నమైన ప్రెజెంటేషన్, ప్రముఖ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్, ప్రారంభం నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుకుంది.

