7tv focus : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడితో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు తయారీ యూనిట్లను నిర్వహిస్తున్న సఫ్రాన్.. లీప్ విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీలో కీలక కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరిన్ని తయారీ కార్యకలాపాలను చేపట్టేందుకు సంస్థ ఆసక్తి కనబరచడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

