అమరావతి 7tv focus : రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. గురువారం E 13, E 15, E 1, E 3 రహదారి నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మంగళగిరి నుంచి అమరావతికిలోకి ప్రవేశించే E 15 రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు.16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ ద్వారా అమరావతిలోకి E 13 రోడ్డు ప్రవేశించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు (E 3) మూడో ఫేజ్లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి – మణిపాల్ హాస్పిటల్) పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు.

