అమరావతి 7tv focus : అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుషాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు.

