చౌటుప్పల్, ఆగస్టు 28,(సెవెన్ టీవీ ఫోకస్ );రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోదరభావాన్ని చాటే వేడుకలు ఘనంగా జరిగాయి.ఆకుల ఇంద్రసేనారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ & బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు (చౌటుప్పల్ &నారాయణపురం)దంపతుల నివాసంలో రాఖీ వేడుకలు అభిమానంగా జరిగాయి.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, దీర్ఘాయుష్షుగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ, “రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక మా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.మౌనిక మాట్లాడుతూ అన్నా వదినల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి అని అన్నారు

