7 టీవీ ఫోకస్:03-07- అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుడికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను ఈరోజు చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు.

ఎల్ఓసి పత్రం 130 – సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ కి చెందిన రఘునాథ్ సూర్యావంశ కు రూ.215000/- (రెండు లక్షల పదిహేను వేల రూపాయలు) మరియు రాంరెడ్డి నగర్ కి చెందిన తన్నీడి రాంచందర్ రావు కు 200000 (రెండు లక్షల రూపాయలు )మంజూరు కాగా LOC అందజేసిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు,డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు,గుబ్బల లక్ష్మి నారాయణ గారు, బలరాం రెడ్డి గారు బాలస్వామి గారు, అడపా శేషు గారు,ఇస్మాయిల్ గారు,ప్రశాంత్ గారు,తదితరులు పాల్గొన్నారు.

